మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు తెలంగాణ అంతటా సంచలనగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయమై ఈటల రాజేందర్ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ తలవంచేదీ లేదని అంటూనే మెతక వైఖరి అవలంబిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను మూడు రోజులుగా కేసీఆర్, కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఆ ఇద్దరు అందుబాటులోకి రావడం లేదని మీడియాతో ఈటల రాజేందర్ వాపోయారు. ఈటల ఆరోపణల నేపథ్యంలో ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మేడే సందర్భంగా కేసీఆర్ ఫొటోతో సందేశాన్ని ఇచ్చారు. ఒకవైపు అవినీతి అరోపణలు వస్తుంటే, మరోవైపు ఈటల మెతక వైఖరి ప్రదర్శండమేంటి? అని, అసలు ఈటల ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. క్యాబినెట్ నుంచి ఈటలను తప్పిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Must Read ;- భూఆక్రమణ ఆరోపణలు.. ఇదో కుట్ర ఈటల