విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 2019వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా ఎంతటి ఘాన విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సీక్వల్ ‘ఏఫ్ 3’ ఉంటుందని అప్పట్లోనే దర్శకనిర్మాతలు తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా ‘ఎఫ్ 3’ షూటింగ్ మొదలుకాలేదుగాని లేకపోతే ఇప్పటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది. తాజాగా అందుతున్న టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ను డిసెంబర్ చివరి వారంలో స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే వెంకీ ‘నారప్ప’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు, ఇటు వరుణ్ కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
వీరిద్దరూ ఈ సినిమాలతో పాటుగా ‘ఎఫ్ 3’ షూటింగ్ లో కూడా జాయిన్ అవుతారని టాక్ నడుస్తోంది. ‘ఎఫ్ 3’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవాలని చూస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకనే స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ చేసుకొని షూటింగ్ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడు అనిల్. ‘ఎఫ్ 2’ సినిమా విజయంతో ‘ఎఫ్ 3’ పై కూడా టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే ఈ చిత్రంపై క్రేజ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ‘ఎఫ్ 3’ సినిమా ద్వారా మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి.
Must Read ;- మళ్ళీ లెక్చరర్ గా అదరగొట్టబోతున్న వెంకీ











