జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగరా మోగింది. డిసెంబర్ 1న ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారమే 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మహిళ(జనరల్)కు కేటాయించడంతో మేయర్ పీఠం దక్కించేందుకు సొంత పార్టీ నేతల మధ్య పోటీ ఎక్కువగా పెరిగింది. మేయర్ పీఠం కోసం మంత్రులే ఏకంగా ఫైరవీలు మొదలుపెట్టిన్నట్లు సమాచారం. తమ వారసులను మేయర్ పీఠంపై కూర్చొబెట్టేందుకు కొందరు రాష్ట్ర మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తమ కోడళ్లు, కూతుళ్లను మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు వీరు తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే కొందరు రాష్ట్ర మంత్రులు గులాబీ బాస్ వద్ద ఫైరవీలకు తెరలేపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ కోడలు, కార్మకశాఖ మంత్రి మల్లారెడ్డి కూతురు, మంత్రి సబితారెడ్డి కోడలు, పార్టీ కీలక నేత, ఎంపీ కే.కేశవరావు కూతురు విజయలక్ష్మీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అలాగే కార్మిక నేత పీజేఆర్ కూతురు విజయ, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్యతో పాటు మరికొందరి నేతల వారసుల పేర్లు మేయర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- మేయర్ పీఠం… వయా వరద భీబత్సం