సినిమా తొలి రోజు వసూళ్ల మీదనే అందరి దృష్టీ ఉంటుంది. ఇప్పుడు ఆ స్థానంలో ‘పుష్ప’ సినిమా ఉంది. తొలి రోజు ఎంత వసూలు చేస్తుందన్న లెక్క మీదే అందరి దృష్టీ ఉంది. ఎక్కువ థియేటర్లలో విడుదలైతే ఎక్కువ వసూళ్లు ఉంటుందన్నది అందరికీ తెలిసిన సత్యమే. దక్షిణాది చిత్రాల్లో తొలి రోజు వసూళ్లలో రికార్డు ఇప్పటిదాకా ‘బాహుబలి – ది కంక్లూజన్’ పేరుతోనే ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లో కలిపి తొలి రోజు దాదాపు 214 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో ప్రభాష్ ‘సాహో’ ఉంది.
ఇది రూ. 127. 7 కోట్లు వసూలు చేసింది. బాహుబలిగాని, సాహోగాని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాష్లలో విడుదలయ్యాయి. ఈసారి పుష్ప, ట్రిపుల్ ఆర్ చిత్రాలు ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్నాయి. మూడో స్థానంలో రజినీకాంత్ 2.0 ఉంది. ఇది 93.3 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 87.5 కోట్లతో కబాలి ఉంది. ఇది కూడా రజినీకాంత్ చిత్రమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం 81.4 కోట్లను తొలి రోజు వసూలు చేసింది. అయితే రాజమౌళి బాహుబలి మొదటి భాగం మాత్రం 73 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
తొలి రికార్డు మాత్రం ఈ సినిమాదే. మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియడంతో రాజమౌళి దూకుడు పెంచి బాహుబలి 2 మీద ప్రయోగించారు. అది సక్సెస్ కావడంతో అందరూ అదే దారిలో వెళుతున్నారు. ఇక తొలి రోజు వసూళ్ల పరంగా ఆ తర్వాతి స్థానాలు తమిళ హీరో విజయ్ కు దక్కాయి. సర్కార్ 66.9, బిజిల్ 63.4 కోట్లు సాధించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 60.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ 58 కోట్లు, భరత్ అనే నేను 53.8 కోట్లు, వకీల్ సాబ్ 53.5 కోట్లు, సరిలేరు నీకెవ్వరు 53 కోట్లు, మాస్టర్ 52 కోట్లు వసూలు చేశాయి. దర్బార్ 51.2 కోట్లు, ఖైదీ నంబర్ 150 మాత్రం 50.45 కోట్లు వసూళ్లు సాధించాయి. మహర్షి 48.1, అలవైకుంఠపురములో 47.7 కోట్లు వసూలు చేశాయి. మెర్సల్47.1, జైలవకుశ 46.6 కోట్లు వసూలు చేశాయి.
తొలి రోజు వసూలు చేసిన టాప్ ట్వంటీ చిత్రాలివి. వీటిలో మన తెలుగు చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. మొదటి రెండు స్థానాల్లో మన తెలుగు చిత్ర పరిశ్రమే ఉంది. రేపు పుష్ప విడుదలతో ఈ లెక్కలు తారు మారయ్యే అవకాశం ఉంది. పుష్ప తొలిరోజు ఎంత వసూలు సాధిస్తుందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రాలో మాత్రం 4 షోలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంది. షోలు తగ్గిపోవడం, టిక్కెట్ ధరలు తగ్గడం వల్ల భారీ వసూళ్లు సాధ్యమవుతాయా లేదా అన్నది వేచి చూడాలి. తగ్గేదే లే అనే డైలాగ్ ఈ సినిమాలో ఎలాగూ ఉంది కాబట్టి వసూళ్లలోనూ వెనక్కి తగ్గదనే మనం భావించాలి.
Must Read ;- గోండు బెబ్బులి.. మన్యం పులి.. వెరిసి ట్రిపుల్ ఆర్











