గోండు బెబ్బులి.. మన్యం పులి.. గర్జిస్తే ఎలా ఉంటుంది.. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ అలాగే ఉంది. విజువల్ వండర్ చేయడంలో దర్శక ధీరుడు రాజమౌళి తనకు తానే సాటి అని మరోసారి నిరూపించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు ఉదయం విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ ట్రైలర్ విడుదలైంది. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్ఠీఆర్ ఎలా చెలరేగిపోయారో ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
మూడు గంటల సినిమాని మూడు నిమిషాల ట్రైలర్ చూసి విశ్లేషించడం కష్టమే. సినిమా మీద హైప్ పెంచే విషయంలో ఈ ట్రైలర్ చాలావరకు ఉపయోగపడింది. బిట్రీష్ వారి మీద తెలుగు వీరుల తిరుగుబాటుగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పవచ్చు. ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ తో పాటు టైటిల్ కు తగ్గట్టుగానే రౌద్రం… రణం…రుధిరం… అన్నీ కనిపించేలా ట్రైలర్ ఉంది. హాలీవుడ్ దర్శకులను తలదన్నేలా తన మేకింగ్ స్టయిల్ ఉంటుందని రాజమౌళి మరోసారి నిరూపించారు.
గోండు జాతికి చెందిన ఓ పాపను బ్రిటీష్ సైనికులు తీసుకొస్తే ఆమె కోసం రాజీవ్ కనకాల రావడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘గోండు పిల్లను స్కాట్ దొరవారు తీసుకొచ్చారు’ అని రాజీవ్ కనకాల అంటే ‘వాళ్లకేమైనా కొమ్ములుంటాయా?’ అన్న ప్రశ్నకు ‘ఓ కాపరి ఉంటాడు’ అన్న సమాధానానికి జవాబుగా ఎన్టీఆర్ పాత్ర దర్శనమిస్తుంది. పులిని ఎదుర్కొనే రౌద్ర రూపంలో ఎన్టీఆర్ ఇంటడక్షన్ అదిరిపోయింది.
పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి అనగానే ‘ఆ పని చేయగలిగేది ఒక్కడే’ అనగానే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ప్రత్యక్షమవుతాడు. ఈ రెండు పాత్రల మధ్య ఎలాంటి అనుబంధం ఉందన్నది సినిమా చూస్తేగాని చెప్పలేం. ఓ సన్నివేశంలో మాత్రం వీరిద్దరూ ఒకరితో ఒకరు తలపడే ఫైట్స్ సీక్వెన్స్ కూడా ఉంది. ‘బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా’ అంటూ రామ్ చరణ్ పాత్ర అనడంతో కథపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. రీరికార్డింగ్ పరంగానూ సినిమా ఓ రేంజ్ లో ఉంది.
Must Read ;-ఆ మూడు సినిమాల మీదే ఎన్టీఆర్ ప్రత్యేక దృష్టి











