మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పేరు ఖిలాడి. ప్రీ-లుక్ పోస్టర్‌తో టీజ్ చేసిన తర్వాత ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు ఆవిష్కరించారు. నలుపు, నలుపు రంగు దుస్తులు ధరించిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆకట్టుకునేలా ఉంది. ప్లే స్మార్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. పోస్టర్‌లో కరెన్సీ నోట్లను ఎందుకు వెదజల్లారన్నది ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ‘ఖిలాడి’ టైటిల్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటోంది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. హవిష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ సినిమా ప్రారంభోత్సవం 11.55 గంటలకు జరుగుతుంది. ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, డింపుల్ హయతి రెండో కథానాయికగా నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు రమేష్ వర్మ అంటున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ‘లూసిఫెర్ ’ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు. సంగీత దర్శకుడు డీఎస్పీ సోదరుడు సాగర్, శ్రీకాంత్, విస్సాతో కలిసి డైలాగ్స్ రాస్తున్నారు, అమర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్. సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మల కాంబినేషన్ లో ఇంతకు ముందు ‘రాక్షసుడు’రూపొందింది. ‘ఖిలాడి’ రెగ్యులర్ షూట్ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది.











