అందం, హాట్ నెస్, బోల్డ్ నెస్ కలగలిసిన మనోహర సుందరి నోరా ఫతేహి. ‘బాహుబలి’ లో ఆమె స్పెషల్ పెర్ఫార్మెన్సే దీనికి అత్యుత్తమ ఉదాహరణ. మనోహరీ అనే పాటకు ఆమె చేసిన నృత్యాలకు భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇక ఈవెంట్స్ లో, అవార్డు ఫంక్షనస్స్ లో అమ్మడి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ సీజన్ లో వరుస ఈవెంట్స్ లో ఈ సుందరి.. మెరుపులు ప్రత్యేకఆకర్షణగా నిలిచిపోతున్నాయి. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ 2020 – 21 అవార్డుల ఫంక్షన్ లో నోరా ఫతేహి వస్త్ర ధారణ హైలైట్ గా నిలిచిపోయింది.

పాపులర్ డిజైనర్ జార్జెస్ చక్ర రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో ఆ అవార్డు ఫంక్షన్ లో మెరిసిపోయిన నోరా .. సోషల్ మీడియాలో కుర్రకారును హీటెక్కిస్తోంది. గోల్డెన్ కలర్ మెటాలిక్ డ్రెస్ లో నోరా ఫతేహి.. నిజంగా మనోహరిలాగానే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోన్న నోరా ఫతేహి.. త్వరలో కథానాయికగా నటించేందుకు రెడీ అవుతోందని సమాచారం. మరి అమ్మడు ఈ హాట్ పోజులతో ఎన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
Must Read ;- ఫొటోలు కేక.. ఆర్జీవం ‘నైనా’నందకరం










