ఇంత అరాచకమా.. !
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అధికారపార్టీ కావాలనే సెన్సిటివ్ చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న వాతారవణంలో రాజకీయ రక్తపాతాన్ని చిలకరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న లోకల్ సంస్థలకు నిర్వహించిన ఎన్నికల్లో కొండపల్లి ఒకటి. ఎన్నికలు, కౌంటింగ్ అంతా ఇక్కడ ఉత్కంఠతగానే నడిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి -14, వైసీపీకి -14 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇరు పార్టీలకు సమాన స్థానాలు రావడంతో టై అయింది. అయితే ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మరో కౌన్సిలర్ అభ్యర్థిని టీడీపీలో చేర్చుకుని 15 కౌన్సిలర్ స్థానాల్లో టీడీపీ నిల్చింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన ఎక్స్ – ఆఫీషియో ఓటును వినియోగించుకోగా .. టీడీపీ తరుఫున ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా ఎంపీ కేశినేని ఉండడంతో పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. నిన్న సోమవారం ఉదయం చైర్మన్ అభ్యర్థి ఎంపిక ఉండడంతో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సమావేశం మందిరంలోకి రాగానే తొండాటకు తెరతీసింది అధికార వైసీపీ. ఇరువర్గాల బాహాబాహికి దిగడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ ఎన్నికను వాయిదా వేశారు.
కోర్టు ఆదేశాలు బేఖాతరు!
హైకోర్టు ఉత్తర్వులు మేరకు సోమవారం నాడే చైర్మన్ ఎంపిక చేయాల్సి ఉందని పట్టుపట్టాయని టీడీపీ శ్రేణులు. అయిన కోర్టు ఆదేశాలు ఉండగా.. అలా ఎలా బేఖాతరు చేస్తూ వాయిదా వేస్తారని టీడీపీ నాయకులు, ఎంపీ అధికారులను నిలదీశారు. అధికారులు ఎందుకు ఎన్నికను వాయిదా వేశారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, అప్పటి వరకు కౌన్సిల్ సమావేశ మందిరం నుంచి కదలమని భీష్మించింది టీడీపీ. కౌన్సిల్ మందిరాన్ని ఖాళీ చేయకుంటే అరెస్ట్ చేస్తామని పోలీసు చెప్పడంతో అక్కడినుంచి దేవినేని ఉమా నివాసంలో కౌన్సిలర్ కు విడిది ఏర్పాటు చేశారు. అయితే అరెస్ట్ పేరుతో టీడీపీ వద్దనున్న కౌన్సిలర్ సభ్యులను వారివైపు లాక్కోవాలని చూసిన వైసీపీ ఎత్తులను పసిగట్టి, ప్రస్తుతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీడీపీ.
Must Read ;- టీడీపీ అత్యవసర సమావేశం .. రూట్ మ్యాప్ రెడీ!











