అప్పులు పుట్టే పరిస్థితి లేకనే.. అకృత్యాల వైపు అడుగులు!
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. బ్యాంకులు, జాతీయ రంగ పైనాన్స్ కంపెనీలు ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి అప్పులిచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు పుట్టక, కనీసం చేతులో సాదరు ఖర్చులకు కూడా డబ్బులేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అమ్మకాలకు, తనఖాకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంతటి దౌర్భగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు అన్నది వాస్తవం. సెప్టెంబర్, అక్టోంబర్ నెలల్లో కేంద్రం ఆదుకోగా .. గడిచి గట్టేక్కిన ఏపి ప్రభుత్వం ఈ నెల పరిస్థితి కడుదయనీయంగా మారింది. వీరి ఆర్థిక విధానాలకు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయి. అవి చాలకా జగన్ డేగ కన్ను దేశంలోని తొలి ఆరోగ్య వైద్య విశ్వ విద్యాలయమైనా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులపై పడింది. ఉన్నఫలంగా రూ.250 కోట్లు అవసరం వచ్చిందని వైద్యారోగ్యశాఖ అధికారులను యూనివర్సిటీ పైకి వదిలాడు జగన్ రెడ్డి. దీంతో అడిగిన నిధులు సర్దుతారా? లేదా ? అంటూ యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు
ఎయిడెడ్ వదిలేసి వర్సిటీలపై కన్నేసి!
మొన్నటి మొన్న ఎయిడెడ్ ఆస్తులను విలీనం చేయాలని ప్రయత్నించిన జగన్ కు శృంగ భంగం తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ స్థాయిలో విద్యార్థి సంఘాలు, యాజమాన్యాలు, అఖిల పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంచెం వెనకడుగు వేసినట్లు ఉన్నప్పటికీ జగన్ రెడ్డి అనుకున్న పని అనుకున్నట్లు చేసేవరకు నిద్రపోడు. చివరికి మావోలో కూడా ఎయిడెడ్ విలీనాన్ని తీవ్రం తప్పపట్టారు. దీంతో ఎయిడెడ్ తేనె తుట్టను కదిలించుకుని తప్పు చేశానని జగన్ రెడ్డికి తత్వం బోధపడింది. విలీనం ఐడియా ఫలించకపోవడంతో నిధులను సేకరించే పనిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పై కన్ను పడింది. వర్సిటీ ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం అసలుండదు. నిధులు ఖర్చు చేయలన్నా, కార్యనిర్వాహక మండలి అనుమతి అవసరముంటుంది. యూనివర్సిటీ ఫండ్స్ ను పరిమితికి మించి అదనంగా ఖర్చుపెట్టే అధికారం యూనివర్సిటీ రిజిస్ట్రారు కూడా లేదు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రూ.250 కోట్లను యూనివర్సిటీ నిధుల నుంచి రాష్ట్రాభివృద్ధి సంస్థకు బదిలీ చేయాలని వర్సిటీ అధికారులకు మధ్య హుకుం జారీచేశారు. కానీ వర్సిటీ అధికారులు దీనిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే గత రెండు రోజులు నుంచి సీన్ కాస్తా సీరియస్ అయ్యింది. సీఎంవో కార్యాలయంలోని పెత్తనం చేలాయించే ఒక అధికారి రంగంలో దిగి కాస్తా హడవుడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
కనీస నిబంధనలు కూడా ఫాలోకారా?
అనుకున్న పని అనుకుంటే అయిపోవాలి. ఆ పనికాకుంటే నియమాలు, నిబంధనలను బ్రేక్ చేయడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. పని అయ్యేవరకు అడ్డదిడ్డంగా ముందుకు పోవడమే జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాథమిక సూత్రం. ఈ ఒంటెద్దు పొకడ కారణంగానే జగన్ ప్రభుత్వంపై వందల సంఖ్యలో కోర్టు మొట్టికాయాలు వేసింది. వర్సిటీ నిధులు హస్తగతం చేసుకునే ప్రయత్నంలో కూడా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపనీయమే. వర్సిటీకి సంబంధించిన రూ.450 కోట్లు జాతీయ బ్యాంకులో ఎఫ్డీల రూపంలో ఉన్నాయి. వీటిలో ఒక్కరూపాయి బయటకు తీసుకురావాలన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. అదే విషయాన్ని వర్సిటీ అధికారులు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకున్న వినకుండా మొండిగా వ్యవహిస్తున్నట్లు సమాచారం. వర్సిటీకి ఏటా దాదాపు రూ.70 కోట్లు అవసరం ఉంటుంది. ఈ నిధులు ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి లేదు. కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు కట్టే ఫీజలు, పరీక్షల ఫీజులు, ఎఫ్డీల పై వచ్చే వడ్డీతో వర్సిటీ నిర్వహణ జరుగుతోంది. ఈ నిధులను కదిలిస్తే వర్సిటీ తీవ్ర నష్టం జరుగుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడకుంటే ఉద్యమిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Must Read ;- ఢిల్లీలో అడుక్కుంటున్న మాట వాస్తవమేగా!











