వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ తీరు మారలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజుపై దా*డి చేసిన కేసులో సురేష్ మరోసారి అరెస్టయ్యారు. ఆయనకు మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. సురేష్‌ను గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్‌లో సురేష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ స్థాయిలను పరీక్షించారు. సురేశ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో ఇతరులను ఖాళీ చేయించారు. ఆయన అనుచరులు భారీగా చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
ఏం జరిగింది?
ఈ నెల 17న రాత్రి 8.30 గంటల సమయంలో రాజు మద్యం మత్తులో బొడ్డు రాయి సెంటర్‌లో ఉండగా అటుగా ప్రయాణిస్తున్న నందిగం సురేష్ కారు ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి అతడిని ఢీకొట్టింది. బెంబేలెత్తిన రాజు అంత వేగం ఎందుకు, నెమ్మదిగా వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించడంతో సురేష్ ఆగ్రహంతో ఊగిపోయి కారు నుంచి దిగారు. వెనుక సీట్లో కూర్చొన్న ఆయన సోదరుడు వెంకట్ కూడా దిగి రాజుపై దారుణంగా దా*డి చేశారు. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డారు.
ఆ సమయంలో సురేష్ అనుయాయులు మరో ఐదారుగురు మోటరు సైకిళ్లపై వెనుక అనుసరిస్తూ వచ్చారు. రాజును వారు ఇంటికి తీసుకెళ్లి బంధించిన తర్వాత నందిగం సురేష్ భార్య బేబి చెప్పుతో కొట్టారు. ఈ మేరకు బాధితుడి భార్య చైతన్యలక్ష్మి శనివారం అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సురేష్‌ను తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ఆదివారం అరెస్టు చేశారు.
నందిగం సురేష్ వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. రాజధాని అమరావతిపై జగన్ కుట్రలను అమలు చేయడంలో నందిగం సురేష్ దిట్ట. అప్పట్లో చెరకు తోటలకు నిప్పు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ఆధారాల్లేకపోవడంతో బయటపడ్డారు. ఈ పనులు చేయడంతో జగన్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత ఇసుక సహా ఇతర వ్యవహారాలతో పెద్ద ఎత్తున సంపాదించారు. చివరికి యాత్ర సినిమాకు డబ్బులు బ్లాక్ మనీ అంతా సురేషే పెట్టారని చెబుతారు. అందుకే ఈ సినిమాలోఆయన పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.
దా*డులు, దౌర్జన్యలతో అమరావతి ప్రాంతంలో హంగామా చేసేవారు నందిగం సురేష్. ఇప్పటి మంత్రి సత్యకుమార్ యాదవ్‌నూ వదిలి పెట్టలేదు. మూడు రాజధానుల పేరుతో డ్రామాలు నడిపించారు. అమరావతి రైతులపై దా*డులు చేయించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌కు పారిపోయారు. అయితే హైదరాబాద్ లో పట్టుకుని తీసుకు వచ్చి జైలుకు పంపారు. బెయిల్ పై బయటకు వచ్చారు. అయినా సురేష్ దందాలు మాత్రం మారడం లేదు.











