మెరుగైన పీఆర్సీ సాధించే వరకు ఉద్యమం ఆగదు!
ఉద్యోగులకు చట్టప్రకారం అందవల్సిన మెరుగైన పీఆర్సీని సాధించే వరకు ఉద్యమం ఆపేది లేదన్నది ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సభ్యులు వాదన! మరో వైపు రెండు నెలలుగా చర్చలు ద్వారా తమ డిమాండ్స్ ను ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేసిన వినతులను పెడచెవిన పెట్టింది జగన్ ప్రభుత్వం! చివరికి ఉద్యోగులను ఉద్యమం వైపు నడిచేలా చేసింది. అలా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు తమ మాట వినడం లేదని ఎస్మా చట్టం ప్రయోగిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే ఉద్యమమని, అవసరమైతే జైలుకెళ్లేందుకూ కూడా తాము సిద్ధంగా ఉన్నామని రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా జేఏసీ నేతలు తెగసే చెప్పారు.
ఎస్మాకు భయపడేదే లేదు..
ఎస్మా చట్టానికి భయపడేది లేదని జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరక పోరాడతామని, చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే.. తాము నాలుగు అడుగులు వేస్తామని చెప్పారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన వాటికి ముందు సమాధానం చెప్పాలని, మూడేళ్లు తిరిగాం.. ఇంకా మోసం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్ణణ వాతావరణాన్ని తీసుకురావొద్దని ప్రభుత్వానికి విన్నవించారు. లక్ష మందితో 3న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోకుంటే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి 3న చలో విజయవాడ, 5న ప్రభుత్వ యాప్ లను డౌన్ చేసి సహాయ నిరాకరణ, 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు.
Must Read:-ప్రయత్నించి చూడు.. ప్రగతి రథచక్రం ఆగకుంటే ఓట్టు..!