జీతాల జగడాన్ని జిల్లాల పేరుతో డైవర్షన్..
జీతాలు జగడాన్ని కొత్త జిల్లాల పేరుతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది జగన్ రెడ్డి ప్రభుత్వం! ఏపీలో ఉన్న 13 జిల్లా కాస్తా 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 26 జిల్లాలతో ఏపీ జిల్లాలను పునర్విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై ప్రజలు, ప్రజాభిప్రాయాలు తీసుకునేందుకు ఫిబ్రవరి 26 నుంచి అభిప్రాయాలు చెప్పవచ్చునని తెలిపింది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో నూతన పరిపాలన సాగించేందుకు సమాయక్తమౌతోంది ప్రభుత్వం! 26 జిల్లాలతో పాటు, కొత్తగా మరో 15 రెవిన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ప్రజలు, మేధావులు, సొంత పార్టీ నేతలు సైతం.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పపట్టి ఆందోళన బాటపడుతున్నారు. ఇదిలా ఉంటే పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. హక్కులు ప్రకారం రావాల్సి వేతనాలు, ఇతర ప్రయోజనాలను అందించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమయ్యిందని నిరసిస్తూ.. వివిధ రూపాయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఉద్యోగులు ఆందోళనలు కాస్తా.. సమ్మె రూపం దాల్చి.. ప్రభుత్వ మెండి వైఖరిని ఎండగట్టేందుకు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా తెరపైకి కొత్త జిల్లా ఏర్పాటుపై జగన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని చేస్తున్న హడావుడి కేవలం ఉద్యోగులు ఇష్యూను డైవర్ట్ చేయడానికే అని పలువురు విమర్శిస్తున్నారు.
జనాభా గణన పూర్తయ్యే వరకు కొత్త జిల్లాలు సాధ్యమేనా?
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం దీనికి ప్రతిబంధకంగా ఖచ్చితంగా మారనుంది. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. దీనిని ఎలా బ్రేక్ చేసి, జిల్లాల సరిహద్దులను విభజిస్తారని ప్రశ్నలు లేకపోలేదు. మరోవైపు జనాభా లెక్కల సేకరణ 2021 మే నాటికి పూర్తి కావాల్సి ఉండగా..కోవిడ్ కారణంగా వాయిదా పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలా ముందుకు వెళుతుంది? ఏమైన ప్రత్యామ్నయాలు ఆలోచిస్తోందా? అన్న విషయంలో స్పష్టత రావలిసి ఉంది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ ను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే దీనిని పల్నాడు వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెనుకబడి ఉన్న పల్నాడులో గురజాలను జిల్లాగా ప్రకటించాలని ఎప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల డిమాండ్స్. ఇప్పటికే అభివృద్ధి చెందిన నరసరావుపేటను జిల్లాగా ప్రకటిచడం కంటే పల్నాడుకు నడిబొడ్డగా ఉన్న గురజాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. నరసరావుపేటను జిల్లాగా ప్రకటిస్తే.. పల్నాడు వాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇంకోవైపు జగన్ రెడ్డి సొంత జిల్లాలో గురువారం కొత్త జిల్లాలపై వివాదం రాజుకుంది. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంగా రాయచోటిని వ్యతిరేకిస్తూ గురవారం రాజంపేటలో ఆందోళన చేపట్టారు. వేలాది మంద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటలో 3 వేల మందికి పైగా విద్యార్థులు వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం గమనార్హం!
Must Read:-ప్రజాస్వామ్య మూల స్తంబాలు కుప్పకూలాయి..! ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం?!