రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ హిరణ్యకశ్యప చేస్తారనుకుంటే.. శాకుంతలం సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదో ప్రేమకథ. మహాభారతంలోని ఆదిపర్వం నందు గల శకుంతలం – దుష్యంత మహారాజు ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గుణ టీమ్ వర్క్ బ్యానర్ లో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను సమంత పోషిస్తుందని ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.

దుష్యంతుడి పాత్ర గురించి కొంత మంది పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ.. ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదు. ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మద్దు అంతా ఫైనల్ అయిన తర్వాత మేమే ఎనౌన్స్ చేస్తామని గుణ శేఖర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడు అందుకుంది. గుణ శేఖర్ అంటే అందరికీ గుర్తకువచ్చేది భారీ సెట్ లు.
ఒక్కడు, సైనికుడు, అర్జున్, రుద్రమదేవి.. ఇలా ఆయన తెరకెక్కించిన సినిమాల్లో భారీ సెట్ లు ఉండడం అనేది కామన్.
శాకుంతలం పౌరాణికం సినిమా కావడంతో సెట్ ల పై మరింతగా ఫోకస్ పెట్టారని సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అన్నపూర్ణ స్టూడియోలో శాకుంతలం కోసం రూపొందిస్తున్న భారీ సెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. గుణశేఖర్ ఓ వైపు కాస్టింగ్ పనులు చేస్తూనే.. మరో వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేస్తున్నారు. ఇలా.. ప్రీ ప్రొడక్షన్ లో స్పీడందుకున్న శాకుంతలం చిత్రాన్ని త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. శాకుంతలం సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Must Read ;- శకుంతల మనసుదోచే దుష్యంతుడు ఇతడేనా?
Before the grand sets are erected .. the miniatures get their finishing touches by Art Director Ashok Garu himself!
This morning at Annapurna Studios.#Shaakuntalam #EpicLoveStory #MythologyforMilennials @Gunasekhar1 @Samanthaprabhu2#Manisharma @neelima_guna@GunaaTeamworks pic.twitter.com/eRCl2C4Bhv— Gunaa Teamworks (@GunaaTeamworks) January 23, 2021











