పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సివుంది. ఏప్రిల్ లో ఈ క్రేజీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సినిమా గురించి అప్ డేట్ సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు కానీ.. ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ సలార్. ఈ సినిమాని ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభించారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయనున్నారు. మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ మూవీ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రబాస్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తుంది. ఈ సినిమా గురించి సంక్రాంతికి ఎలాంటి అప్ డేట్ బయటకు రాకపోవడంతో అభిమానులు ట్విట్టర్ లో నాగ్ అశ్విన్ ని అడిగితే.. ఖచ్చితంగా చెప్పాలంటే.. జనవరి 29న, ఫిబ్రవరి 26న అప్ డేట్స్ వస్తాయంటూ’ రిప్లై ఇచ్చాడు. నాగ్ అశ్విన్ ఇలా రిప్లై ఇవ్వడంతో జనవరి 29న, ఫిబ్రవరి 23న ఏ అప్ డేట్ రానుందో అని ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Must Read ;- రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?