కేంద్రం బడ్జెట్ విడుదల చేస్తన్న ప్రతిసారి.. ఈ హల్వా కార్యక్రమం ఏంటి అందరికీ అనుమానం రావుచ్చు. ఇది ఎప్పుడు మొదలైంది అనే దానికి తగినన్ని ఆధారాలు లేకపోయినా.. కొన్ని దశాబ్దాలుగా ఈ హల్వా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాత్రం ఆధారాలున్నాయి. సాధారణంగా మన భారతీయ సంప్రదాయం ప్రకారం, ఏదైనా ముఖ్యమైన పనిని మొదలుపెట్టే ముందు తీపిని చేసి పంచిపెట్టే అలవాటు ఉంటుంది. ఇదే ఈ కార్యక్రమానికి వర్తిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎప్పుడు, ఎవరు నిర్వహిస్తారు?
బడ్జెట్‌కి 10 రోజుల ముందు ఈ ‘హల్వా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఫిబ్రవరి1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఈ రోజు (జనవరి 23)న హల్వా కార్యక్రమానికి ఏర్పాట్లు జరిగాయి. మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని సమాచారం. కరోనా కారణంగా కొందరు మంత్రులు మాత్రమే పాల్గొననున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులు పొల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంటికి వెళ్లకూడదు..
ఈ కార్యక్రమం తర్వాత బడ్జెట్‌కి సంబంధించిన పత్రులను సిద్ధం చేయడానికి పూనుకుంటారు అధికారులు. అలా బడ్జెట్ పత్రులు ముద్రించే అధికారులు ఈ పది రోజుల పాటు ఇంటికి వెళ్లకూడదు. ఎందుకు అనుకుంటున్నారా? బడ్జెట్‌కి సంబంధించిన ఏ విషయంకానీ బయటకు పొక్కకూడదనే ఆలోచనతో కేంద్రం ఈ తరహా పద్దతిని కొన్ని దశాబ్దాలుగా పాటిస్తుంది. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా.. పత్రుల ముద్రణ లేకుండా.. బడ్జెట్ డిజిటలైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సిబ్బంది కూడా 40కి మించకుండా ఉండేలా చూసుకుంటున్నట్లు కేంద్ర అధికారులు తెలిపారు.
Also Read: ఇంకా చాలా చేస్తాం : ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతోంది