యాంగ్రీ మేన్ రాజశేఖర్.. ‘గరుడవేగ’ సినిమా నుంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మీదే ఆసక్తి చూపించడం విశేషమని చెప్పుకోవాలి. ఆ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నటించిన ప్రశాంత్ వర్మ ‘కల్కి’ కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే. రీసెంట్ గా కరోనా నుంచి కోలుకొని తిరిగి మామూలు మనిషి అయిన ఆయన ఇప్పుడు సినిమాల మీద పూర్తిగా దృష్టి సారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఇప్పుడో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అవడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సినిమా పేరు ‘శేఖర్’. నేడు రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ విడుదల చేశారు. సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు.
పూర్తిగా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో రాజశేఖర్ రివీలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన ‘జోసెఫ్’ సినిమాకి రీమేక్ వెర్షన్. జోజు జార్జ్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో థ్రిల్ కు గురి చేసింది. లలిత్ అనే యువ దర్శకుడి డెబ్యూ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి లక్ష్మీ భూపాల రచన అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. మరి శేఖర్ గా రాజశేఖర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో చూడాలి.
Must Read ;- తెలుగు తెరపై ఎగసిపడే ఆవేశం .. రాజశేఖర్ (బర్త్ డే స్పెషల్)











