వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధహస్తుడు. అతడి మొదటి సినిమా ‘అ!’తోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. రాజశేజర్ తో తీసిన ‘కల్కి’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వైవిధ్య చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రశాంత్ తీస్తున్న మూడో సినిమా ‘జాంబీరెడ్డి’ కూడా త్రిల్లర్ కథాంశంతో రాబోతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించడం విశేషం. ఈ చిత్రం యొక్క టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా టీజర్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సందీప్ కిషన్ టీజర్ పై ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశాడు. ‘జాంబీ రెడ్డి’ టీజర్ నాకు బాగా నచ్చింది. నేను జాంబీ సినిమాలకు పెద్ద అభిమానిని. త్వరలోనే జాంబీ సినిమాను తెలుగులో చూడడానికి ఎదురుచూస్తున్నాను. అలాగే ఇలాంటి సినిమాను తీస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మను చూసి గర్వ పడుతున్నా’ అని ట్విట్ చేశాడు.
ఇప్పుడు ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే ఒక్క నిమిషం ఉన్న టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అలాగే ‘దైవం మనుష్య రూపేణ అనేది ఇతిహాసం.. రాక్షసం మనుష్య రూపేణ అన్నది ప్రస్తుతం.. అనే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆనంది, దక్షా నగార్‌కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Loved the teaser ..always been a big fan of the Zombie Genre..stoked to see it in Telugu ❤️
So proud of you @PrasanthVarma boy for pulling this off❤️ 😘@tejasajja123 so happy for you darling ❤️😘@DakshaOfficial & @anandhiactress look 🤟🏽#ZombieReddy https://t.co/jN39i44CFc pic.twitter.com/E7tdzxh8DG— Sundeep Kishan (@sundeepkishan) December 5, 2020
Must Read ;- నితిన్ టీమ్ ప్లాన్ అదిరింది.. ఏంటా ప్లాన్..?











