July 4, 2026 1:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Health

కేన్సర్.. మనో నిబ్బరమే మందు!

మనోధైర్యంతో ఎదుర్కొంటే ‘కేన్సర్’ని జయించవచ్చు.

February 4, 2021 at 2:45 PM
in Health, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేన్సర్.. నిశ్శబ్దంగా ప్రాణాలు హరిస్తున్న జబ్బు. దశాబ్దాలుగా ప్రపంచానికి కొరుకుడు పడని వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 41 లక్షల 17 వేల కోట్ల రూపాయల సొమ్మును హరిస్తున్న అత్యంత ఖరీదైన జబ్బు. ఏడాదికి దాదాపు ఒకటిన్నర కోట్ల మందిని బలితీసుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచంపై నిప్పుల కుంపటిలా తయారైన ఈ జబ్బుకి.. నేటికీ టీకా తయారు కాలేదు. చికిత్స ఉన్నప్పటికీ.. అది ప్రారంభ దశలో మాత్రమే పనిచేస్తుంది. ఏడాది క్రితం వచ్చి 20 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనాకు టీకా వచ్చిందేగానీ.. దశాబ్దాలుగా కోట్ల మందిని బలితీసుకుంటున్న ఈ మహమ్మారికి మాత్రం మందు లేదు. ప్రజల్లో కనీసం అవగాహన కూడా లేదు. కరోనా గురించి తెలిసినంతగా కూడా సామాన్యులకు కేన్సర్‌ గురించి తెలియదంటే.. ఏమనుకోవాలి? ఎవరిని తప్పుబట్టాలి? ప్రభుత్వాలనా? వైద్యులనా?

అవగాహనా లోపమే అసలైన కేన్సర్!

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. పేద, మధ్యతరగతి దేశాల్లోనే ఈ మహమ్మారి వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అంటే.. దీనర్థం.. సంపన్న దేశాల్లో లేదని కాదు.. రాదని కాదు. అక్కడా కేన్సర్‌ రోగులు భారీగానే ఉంటారు. కానీ, అక్కడి ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఎక్కువ. ప్రతి ఏడాదీ కేన్సర్‌ కు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటారు. అది తమ బాధ్యతగా భావిస్తారు. ఏ ఒక్క కేన్సర్‌ లక్షణం కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటారు. దీంతో.. కేన్సర్‌ సోకినా.. మరణాన్ని తప్పించుకుంటున్నారు. కానీ, పేద, మధ్యతరగతి దేశాల్లో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడి ప్రజల్లో అధికశాతం మందికి కేన్సర్‌ పై కనీసపాటి అవగాహన కూడా ఉండదు. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయవు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆ పని చేస్తున్నా.. వాటికి ప్రభుత్వం నుంచి సహకారం లభించదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రజలకు ఈ మహమ్మారిపై అవగాహన పెరగడం లేదు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. కేన్సర్‌ లక్షణాలు కూడా అధిక శాతం మందికి తెలియవు. కేన్సర్‌ సోకినా.. అది చివరి దశకు చేరుకునే వరకు దాన్ని గుర్తించలేరు. అప్పటికే సమయం మించిపోవడం వల్ల మరణం తప్పడం లేదు. ఇక్కడి ప్రజల్లో చైతన్య లేమి, నిరక్ష్యరాస్యత ఎక్కువగా ఉండడం కూడా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతోంది.

Must Read ;- హనుమంతుడు సంజీవని తెచ్చారు.. భారత్ టీకా ఇచ్చింది..

అసలు ఏమిటీ కేన్సర్?

సాధారణంగా మన శరీరంలో కణ విభజన ఓ క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఒక్కోసారి ఆ కణ విభజన ప్రక్రియలో నియంత్రణ కొరవడుతుంది. ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఇవి.. కణ సమూహాలుగా ఏర్పడుతాయి. వీటినే కణితలు (ట్యూమర్లు) అంటారు. విభజన చెందిన కణాలు అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపే.. ఈ ట్యూమర్. అలాంటి వాటిలో కొన్ని ప్రమాదకరంగా మారుతాయి. వీటినే కేన్సర్‌ కణితలు అంటారు. వీటికి ఓ స్పష్టమైన విధి ఉండదు. అంతగా ప్రమాదకరం కాని కణితలు కూడా ఉంటాయి. ఇవి అస్తవ్యస్తంగా పెరగవు. ఒక చోట నుంచి మరో చోటకు వ్యాపించవు. అదే కేన్సర్‌ కణితలు అయితే.. నిరవధికంగా, అస్తవ్యస్తంగా పెరిగిపోతాయి. శరీరంలోని ఇతర భాగాలకూ వేగంగా వ్యాపిస్తాయి.

 క్యాన్సర్ లక్షణాలు

ప్రధానంగా 7 రకాల లక్షణాలను కేన్సర్‌ సూచికలుగా వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై పుండు ఏర్పడితే.. వెంటనే మానకపోవడం, అసహజ పద్ధతిలో రక్తస్రావం జరగడం, కణితలు అనూహ్యంగా పెరుగుతుండడం, గొంతు బొంగురుపోవడంతో పాటు దగ్గు ఎంతకీ తగ్గకపోవడం, మల విసర్జన ప్రక్రియలో మార్పులు జరిగి.. మలంలో రక్తం పడడం, ఆహారం మింగుడు పడకపోవడంతో పాటు అరగక పోవడం, పుట్టుమచ్చల్లో మార్పులు జరగడం.. తదితర లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. కేన్సర్‌.. శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉందని, ముఖ్యంగా.. గర్భాశం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు.

Must Read ;- గ్యాస్ట్రిక్ సమస్యా.. అయితే వీటికి దూరంగా ఉండండి!

చికిత్స ఉంది కానీ..

కేన్సర్‌ వ్యాధికి చికిత్స ఉంది. కానీ, అది ప్రారంభ దశలో మాత్రమే పనిచేస్తుంది. ఒక్కసారి వ్యాధి అడ్వాన్స్డ్‌ స్టేజ్‌ కి వెళ్లిందంటే.. వైద్యులు కూడా ఏమీ చేయలేరు. మరణమే శరణ్యం. ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడమే.. మరణాల నివారణలో కీలకం. అలా గుర్తించాలంటే.. ప్రజల్లో దీని పట్ల అవగాహన ఉండాలి. అసలు కేన్సర్‌ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? లాంటివైనా తెలిసి ఉండాలి. ఇదే.. భారత్‌ లాంటి కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కేన్సర్‌ లక్షణాలు తెలుపుతూ.. కూడళ్లలో హోర్డింగులు పెట్టడం, కేన్సర్‌ డే నాడు ర్యాలీలు నిర్వహించడం మాత్రమే సరిపోదు. గ్రామ గ్రామల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, లక్షణాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించడం, కేన్సర్ పరీక్షలు చేయడం.. లాంటి కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వాలు విస్తృతంగా నిర్వహిస్తే.. ఫలితముంటుంది. కేన్సర్‌ ను ప్రారంభ దశలోనే గుర్తించడం వీలవుతుంది. ఇక్కడ మరో ప్రధాన సమస్య ఏంటంటే.. చికిత్సకు అయ్యే ఖర్చు. ఈ ఖర్చు సామన్యులకు పెనుభారం. ఇందుకు భయపడే.. ముందుగా గుర్తించినా.. అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తే.. వేలాది ప్రాణాలను నిలబెట్టడం సాధ్యపడుతుంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు ఉచితంగా, మరికొన్ని తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నాయి. అలాంటి ఆస్పత్రులను గుర్తించి.. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే.. ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

Also Read ;- డైట్ వర్సస్ వ్యాయామం? బరువు తగ్గేందుకు ఉత్తమమైన మార్గం ఏది?

కేన్సర్‌ అంటే మరణం కాదు..

కేన్సర్‌ వచ్చిందంటే.. ఇక మరణమే అన్న భావన నేటికీ అనేక మందిలో ఉంది. ఈ భావనతోనే చాలా మంది సగం చచ్చిపోతున్నారు. ఇది మందులేని వ్యాధని కుంగిపోతుంటారు. ఆ కుంగుబాటే.. వారిని మరణానికి మరింత దగ్గర చేస్తుంది. కేన్సర్‌ రోగులకు ముందుగా కావలసింది.. ధైర్యం, మనో నిబ్బరం. ఈ రెండూ ఉంటే.. కేన్సర్‌ ను సగం జయించవచ్చు. ఈ వ్యాధికి మందులు లేకపోవచ్చు గానీ.. చికిత్స ఉంది. ప్రారంభ దశలోనైతే.. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఖర్చు భరించలేం అనుకున్న వారికి చికిత్స చేసేందుకు కొన్ని కేన్సర్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ఒకవేళ అడ్వాన్స్డ్‌ స్టేజ్‌ లో గుర్తించినా.. మనో నిబ్బరంతో ఎదుర్కొంటే.. కొంత కాలం పాటు దాని ప్రభావాన్ని నిలువరించవచ్చు. కాబట్టి.. కేన్సర్‌ ను భయంతో కాకుండా.. ఆత్మస్తైర్యంతో ఎదుర్కొందాం. దానిపై అవగాహన పెంచుకుందాం. ఆ మహమ్మారిని దేశం నుంచే గాక.. ప్రపంచం నుంచే తరిమికొడదాం.

Also Read ;- అమ్మలూ.. ఇంటినీ, పనినీ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి!

Tags: awarenessbreast cancercancercancer daycancer diseasecancer meaningcancer symptomscancer treatmentChemotherapydefinition of cancerhow cancer startsI can We Can themeleotoprisk factorstypes of cancerwhat are the causes of cancerworld cancer dayworld cancer day 2021
Previous Post

అందంపై అన్ని హక్కులూ కొనేసిందా ఏంటి?

Next Post

పూజా హెగ్డేతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist