Hearing On Jagan Bail Cancel Petition Adjourned :
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు పిటిషన్ పై విచారణ మరోమారు వాయిదా పడింది.ఈ నెల 26కు విచారణను వాయిదా వేస్తూ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇదివరకటి విచారణల మాదిరిగా కాకుండా బుధవారం నాటి విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పిటిషన్ పై ఇప్పటికే జగన్ తన కౌంటర్ దాఖలు చేయగా.. దానిపై రఘురామరాజు తన సమాధానాన్ని కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంలో కీలక పాత్రధారిగా ఉన్న సీబీఐ మాత్రం ఇప్పటికీ తన కౌంటర్ ను దాఖలు చేయలేదు. అయితే బుధవారం నాటి విచారణ సందర్భంగా తన వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించేందుకు ఒప్పుకున్న సీబీఐ.. అందుకోసం 10 రోజుల గడువును కోరింది. సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
సీబీఐ మాట మార్చలేదుగా
జగన్ కు మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ గతంలో సీబీఐ పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ తన కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆరోపించిన సీబీఐ తక్షణమే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని పలుమార్లు కోరిన సంగతి తెలిందే. అయితే జగన్ వివరణల నేపథ్యంలో బెయిల్ అయితే రద్దు కాలేదు గానీ.. ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన ఎంపీ స్వయంగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయడం, దానిని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడంతో జగన్ బెయిల్ రద్దేనన్న వాదనలకు బలం చేకూరింది. అయితే ఎందుకనో గానీ.. ఈ విషయంలో సీబీఐ తన వాదనలను వినిపించేందుకు నిన్నటిదాకా సిద్ధమే కాలేదు. అయితే కోర్టు ఆదేశాలతో సీబీఐ తన వాదనలను వినిపించేందుకు రెడీ అయిపోక తప్పలేదు. గతంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరిన సీబీఐ.. ఇప్పుడు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న రీతిలో వాదనలు వినిపించడం సాధ్యం కాదు కదా. అంటే.. రఘురామ కోరినట్టుగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోరక తప్పని పరిస్థితి తలెత్తిందన్న మాట. ఓ వైపు రఘురామ, ఇంకోవైపు సీబీఐ.. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరితే.. జగన్ వాదనలు వీగిపోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మీడియా ముందుకు రఘురామ
సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ పై బుధవారం జరిగిన విచారణ వాయిదా పడినంతనే మీడియా ముందుకు వచ్చిన రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తన వాదనలు వినిపించే విషయంలో సాంకేతిక కారణాలతో సీబీఐ తాత్సారం చేసిందన్న రఘురామ.. తాజాగా వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించేందుకు సీబీఐ ఒప్పుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై నమోదైన కేసులపై 11 ఏళ్ల పాటు సాగాలి.. తనపై నమోదైన కేసుల విచారణలు వెంటనే ముగియాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. అంతిమంగా జగన్ బెయిల్ రద్దు విషయంలో నాకు న్యాయం జరుగుతుందని రఘురామ చెప్పుకొచ్చారు.
Must Read ;- జగన్ ను బుగ్గన అడ్డంగా ఇరికించేశారే