‘అల్లరి’ నరేశ్ పేరు వినగానే తెరపై ఆయన చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది. అలాంటి అల్లరితోనే ఆయన చకచకా 50 సినిమాలను పూర్తిచేసేశాడు. అల్లరి నరేశ్ కామెడీ మాత్రమే చేయగలడని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ‘గమ్యం‘ .. శంభో శివ శంభో’ సినిమాలు చేసి షాక్ ఇచ్చాడు. నరేశ్ లో మంచి ఆర్టిస్టు ఉన్నాడనీ, ఆయనకి నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసునని అర్థమైంది. అలాంటి ఎమోషన్స్ నేపథ్యంలోనే ఆయన తాజాగా చేసిన ‘నాంది’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సతీశ్ వేగేశ్న నిర్మాణంలో .. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ నెల 19వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. దాదాపు 8 ఏళ్ల తరువాత దక్కిన హిట్ తో అల్లరి నరేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సీరియస్ స్టోరీతో వచ్చిన తనని ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆదరించడం గురించి ఆయన చాలా ఎమోషన్ అయ్యాడు కూడా. ఈ సినిమాకి వస్తున్న స్పందనకు టీమ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ తరువాత కూడా అల్లరి నరేశ్ ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ‘నాంది’ సినిమా హిట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. నేను చాలా బాగా చేశానని అంటున్నారు. నిజానికి కథలోను .. పాత్రలో దమ్ము ఉంది. కథలో .. పాత్రలో విషయం ఉండటం వల్లనే నేను బాగా చేయగలిగాను. వాటిలో విషయం లేకపోతే నేనే కాదు .. ఎవరూ ఏమీ చేయలేరు. ఇంతవరకూ నేరం .. శిక్ష నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేరం చేశాడా? లేదా? అనే ఒక అండర్ ట్రైల్ ఖైదీ పాయింట్ ను ఎవరూ టచ్ చేయలేదు. మేము ఎంచుకున్న ఈ పాయింటే ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది .. ట్రీట్మెంట్ వాళ్లకి నచ్చేసింది. అందువల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- దుబాయ్ లో ‘నాంది’పలికిన సూపర్ స్టార్ మహేష్











