సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా అల్లరి నరేష్ సినిమా ‘నాంది’ ట్రైలర్ విడుదలైంది. ‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు ప్రియమిత్రుడిగా నరేష్ నటించిన సంగతి తెలిసిందే. ఆ స్నేహబంధం ఇప్పుడు వర్కవుట్ అయినట్టుంది. అల్లరి నరేష్ కు ఇటీవల పెద్దగా హిట్లు కూడా లేవు. ‘బంగారు బుల్లోడు’ విడుదలైనా అంత ప్రభావం చూపలేదు. ‘నాంది’ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.
రాజగోపాల్ అనే వ్యక్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న యువకుడి కథతో రూపొందిన చిత్రమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఐదేళ్లు అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న నరేష్ ను విడిపించే లాయర్ పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించారు. సూర్య ప్రకాష్ అనే యువకుడి పాత్ర పోషించిన నరేష్ కు న్యాయం జరిగిందా? తనను ఈ కేసులో ఇరికించిన వారిపై సూర్యప్రకాష్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే నాంది చిత్రమని తెలుస్తోంది.
ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రోజు ఉదయం 10.08 గంటలకు ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. దుబాయ్ లో ఉన్న మహేష్ బాబు ఈ ట్రైలర్ ను ఎలా విడుదల చేశారన్న సందేహం చాలా మందిలో ఉంది. అంతా ఆన్ లైన్ లోనే జరిగిపోయింది. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి నటించారు.
Must Read ;- అల్లరి నరేశ్ ‘నాంది’ రిలీజ్ డేట్ ఇదే !
Happy to unveil the trailer of #Naandhi!! Looks intense… Wishing @allarinaresh and the entire team a blockbuster success. 😊@vijaykkrishna @varusarath5 @SV2Enthttps://t.co/0NI8Aa51Hk
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2021











