పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇంచు మించు పవన్ నటించిన అన్ని సినిమాల్లోనూ ఆలీ తనదైన శైలిలో అద్భుతమైన కామెడీ పండించాడు. నాటి తొలి ప్రేమ నుంచి నిన్నటి కాటమరాయుడు సినిమా వరకూ ఆలీ వాటిలోని కామెడీకి ఆభరణంగా మెరిశాడు. అయితే ఎప్పుడైతే ఇద్దరికీ రాజకీయ నేపథ్యం వచ్చి చేరిందో అప్పటి నుంచి ఇద్దరి మధ్యా కాస్తంత గ్యాప్ పెరిగింది. ఇద్దరిదీ ఇప్పుడు వేరు వేరు పార్టీలు కాబట్టి.. దానికి అదే కారణం అనుకోవచ్చు.
అయితే ఇటీవల కొంత కాలంగా.. ఆలీ పవన్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. తమ మధ్య రాజకీయ పరమైన విబేధాలున్నప్పటికీ.. వ్యక్తిగతంగా తనకి ఆయనతో రిలేషన్ మాత్రం పోలేదని చెప్పాడు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమాలో ఆలీకి ఒక బ్రహ్మాండమైన పాత్ర ఆఫర్ వచ్చిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక సినిమాలో ఒక కామెడీ పాత్రను ఆలీ చేస్తేనే బాగుంటుందని డైరెక్టర్ కి చెప్పాడట పవర్ స్టార్. అందుకే ఇప్పుడు గబ్బర్ సింగ్, సాంబా ఒకే గూటికి చేరుతున్నారనే వార్తలొస్తున్నాయి. దీంతో వపర్ స్టార్ అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ఆందోళన వద్దు, త్వరలోనే మీ ముందుకొస్తా : పవన్ కల్యాణ్











