టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలోనూ, తదితర దక్షిణాది భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి అందాల చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం లైగర్ సినిమాతో ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజూలూ.. చార్మీ సెట్స్ లో సందడి చేస్తూ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో చార్మీ.. రౌడీహీరో విజయ్ దేవరకొండను వెనుక ఎక్కించుకొని బైక్ రైడింగ్ చేసి విజయ్ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.
ముంబై రోడ్ల మీద విజయ్ దేవరకొండ తో కలిసి హోండా యాక్టివా మీద చార్మి చెక్కర్లు కొట్టడం అందరినీ ఆకర్షించింది. లాక్ డౌన్ అనంతరం లైగర్ షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో .. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తరహా కథతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న లైగర్ .. విజయ్ దేవరకొండ కి సరికొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుందని పూరీ నమ్మకంగా చెబుతున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు. మరి లైగర్ మూవీ విజయ్ దేవరకొండకి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ఉప్పెన ను విజయ్ దేవరకొండతో అనుకున్నారట!