టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలుగు ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. ఈ సినిమాని ఎనౌన్స్ చేశారు కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కారణం ఏంటంటే.. హీరోయిన్ ఎవరు అనేది ఫిక్స్ కాలేదు. ముందుగా ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీ అనుకున్నారు కానీ.. సెట్ కాలేదు. అప్పుడు వారు జాన్వి కపూర్ ని కాంటాక్ట్ చేశారు. అలాగే దిశా పటాని, శ్రద్ధా కపూర్లను కూడా అడిగారు. ఎవరూ ఈ సినిమాలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించలేదు. ఇలా ఎవర్నీ అడిగినా నో చెప్పండతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది.
తెలుగులో బెల్లాంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేసిన డైనమిక్ డైరెక్టర్ వినాయకే హిందీలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ని పరిచయం చేస్తుండడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే బాలీవుడ్ హీరోయిన్ కోసం నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శీనులో నటించేందుకు సమంతకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. అలాగే ఆతర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన చిత్రాల్లో తమన్నా, కాజల్ అగర్వాల్ కు కూడా రెమ్యునరేషన్ భారీగానే ఇచ్చారు.
తాజా వార్త ఏంటంటే.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అనన్య పాండే ప్రస్తుతం లైగర్ మూవీలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ లైగర్ ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా ప్రకటించారు. మరి.. అనన్య పాండే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించేందుకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.
Must Read ;- ఈ నలుగురు హీరోయిన్స్ బెల్లంకొండకు నో చెప్పారా?