విశ్రాంత ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మికి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వ్యాయామ ఉపాధ్యాయుడు అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతో తాజాగా ధర్మాసనం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు రత్నకుమార్ తనకు అన్యాయం జరిగిందని గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రత్నకుమార్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అతనికి న్యాయం చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు సమయంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న ఉదయలక్ష్మి కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో వ్యాయామ ఉపాధ్యాయుడు రత్నకుమార్ మరలా కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కోర్టు దిక్కరణ
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకపోవడాన్ని ధర్మాసనం కోర్టు దిక్కరణగా పరిగణించింది. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిపై ఏపీ సీఎస్ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే విచారణలో ఉదయలక్ష్మిని కూడా హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Must Read ;- మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదు : హైకోర్టు