రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ణానం ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు తెలిపారు. మన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. తనపై కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, రెండేళ్లుగా మాన్సాస్ ట్రస్టును అనేక రకాలుగా నష్ట పరిచారని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Must Read ;- డామిట్ ! కథ అడ్డం తిరిగింది.. వైసీపీ అర్ధరాత్రి యాక్షన్ ప్లాన్‌కు బ్రేక్