ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. అసలు ఆమె నియమకాన్నే సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది.
కేసు వివరాలు..
ఈ ఏడాది మార్చి 31తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియడంతో, ఆయన స్థానంలో మాజీ సీఎస్ నీలం సాహ్నీని ఎస్ఈసీగా నియమించారు. నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న 8 రోజుల్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు. నోటిఫికేషన్ తరవాత కనీసం నాలుగు వారాల సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారు. అయితే ఆ ఎన్నికలను కూడా హైకోర్టు రద్దు చేసింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించించిన సంగతి తెలిసిందే.
Must Read ;- విశ్రాంత ఐఏఎస్ ఉదయలక్ష్మికి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్