ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎన్నికలు సాధ్యం కావని, కరోనా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ప్రభుత్వానికి సిబ్బంది అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం నిన్న హైకోర్టులో పిటీషన్ చేసింది. వెంటనే ఇశాళ ఎస్ఈసీ కూడా హైకోర్టులో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సహకరించడం లేదంటూ పిటీషన్ దాఖలు చేసింది. ఇంత వరకు దేశంలో కరోనా టీకా అందుబాటులోకి రాలేదని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశించినా స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ పిటీషన్ లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం కోర్టు దిక్కరణకు పాల్పడుతోందని పిటీషన్ లో కోర్టుకు తెలిపారు. సీఎస్ తీరుపైనా ఎస్ఈసీ కోర్టుకు ఫిర్యాదు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఎస్ఈసీ పిటీషన్లో కోర్టుకు తెలిపింది.
Must Read ;- వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే…