మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు వరుసగా కరోనా పాజిటివ్ అని తేలుతుండడం అభిమానులకు కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి మొన్న మెగా బ్రదర్ నాగబాబుకి కరోనా వచ్చి తగ్గింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి కరోనా వచ్చి.. నెగెటివ్ అని తేలగా ఊపిరి పీల్చుకున్నారు . ఇక నేటి ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకి కరోనా పాజిటివ్ అని తేలిందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
అంతలోనే ఇప్పుడు వరుణ్ తేజ సైతం తనకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని .. సింప్టమ్స్ కనిపిస్తున్నాయని.. అందుకే తాను హోం క్వారంటైన్ కు వెళ్ళినట్టు చెప్పాడు. త్వరలోనే తాను కోలుకొని తిరిగి వస్తానని అన్నాడు. మరి ఈ మెగా బ్రదర్స్ ఇద్దరూ ఎంత తొందరగా కోలుకొని తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటారో చూడాలి.
Must Read ;- హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజిటివ్
— Varun Tej Konidela (@IAmVarunTej) December 29, 2020











