స్థానిక సంస్థల ఎన్నికల హంగామాకు తెరపడింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
సుదీర్ఘ హైడ్రామా
ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై విపరీతమైన రాద్ధాంతం రేగింది. ఒకవైను కరోనా వాక్సినేషన్ జరగబోతున్న నేపథ్యంలో.. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలనే డిమాండ్ వైఎస్సార్సీపీ అనుకూల వర్గాల నుంచి వచ్చింది. విపక్షాలన్నీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ ను స్వాగతించాయి. అదే సమయంతో ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాధ్ దాస్.. ఏకంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపున ఉద్యోగవర్గాలు, పోలీసు సంఘాల తరఫునుంచి కూడా.. ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కరోనా నేపథ్యంలోె ఇప్పటికే అనేక మంది ప్రాణాలు బలిపెట్టాం అని.. మరిన్ని ప్రాణాలను బలిచేయలేమని.. తాము కూడా ఎన్నికల ప్రక్రియను బహిష్కరిస్తున్నామని ఉద్యోగులు ప్రకటించారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు ఎస్ఈసీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది.
ఇప్పట్లో లేనట్టే
నోటిఫికేషన్ రద్దు కావడంతో.. ఇప్పట్లో ఇక ఎన్నికలు లేనట్టే అనుకోవాలి. మార్చిచివరి వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో కొనసాగుతారు. అప్పటిదాకా ఎన్నికలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది స్పష్టం. దీంతో మే నెల వరకు కూడా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదు.
Must Read ;- ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి తొలగింపు.. ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం