నాగరిక ప్రపంచంలో ఉన్నామా.. లేక ఆటవిక లోకంలో ఉన్మామా అన్నట్లుగా అనిపించే విధంగా.. దారుణంగా నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను హత్య చేసిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. హైకోర్టుతో పాటు.. జిల్లా కోర్టులలో కూడా విధులను బహిష్కరించి న్యాయవాదులను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ.. న్యాయవాదులు ధర్నాకు దిగారు. న్యాయవాదులతో పాటు లా విద్యార్ధుల కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. న్యాయవాదుల కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. నిర్ధష్ట కాలపరిమితి విధించి.. ఆ సమయంలోగా విచారణ పూర్తి చేయాలని పేర్కొన్న హైకోర్టు. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాశాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హత్య కేసులో సాక్షాలను పగడ్భందీగా సేకరించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
కాగా, వామన రావు దంపతుల హత్యపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి అప్పగించాలని, శ్రవంత్ తన పిటిషన్‌లో పేర్కోన్నారు. పిటిషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.
Must Read ;- న్యాయవాదుల హత్యను ఖండించిన కోదండరాం..










