సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదాపడిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
జనవరి 7న ఈ సినిమాని విడుదల చేయాలి అనుకున్నప్పుడు ప్రమోషన్స్ కోసం 20 కోట్ల వరకూ ఖర్చుపెట్టారు. కరోనా కారణంగా అదంతా వృధా అయింది. ఇప్పుడు మార్చి 25న రిలీజ్ కాబట్టి మార్చి 1 నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రానికి మళ్ళీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈసారి రాజమౌళి భారీ స్కెచ్ ను రెడీ చేశారట. టీవీ ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్స్ మొదలు పెట్టబోతున్నారు. అంతే కాదండోయ్.. ఈసారి హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా చేయబోతున్నారట.
ఇక అసలు విషయానికి వస్తే… ఈ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ ను రంగంలోకి దింపబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి వరల్డ్ వైడ్ క్రేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే టామ్ క్రూజ్ ను గెస్ట్ గా ఆహ్వానించాలి అనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ఆర్ఆర్ఆర్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం.