దళిత మంత్రికి అవమానం?
ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరతకు ఘోర అవమానం జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మేకతోటి సుచరితను ప్రభుత్వం మరిచిపోయింది. తనకివ్వాల్సిన ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం వహించింది. ఒక దళిత మంత్రి అనికూడా చూడకుండా ఇంతలా అవమానిస్తారా? అని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర వంటశాలను శుక్రవారం సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సుచరిత హాజరుకాలేదు. గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సుచరితకు ఈ కార్యక్రమంలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కేంద్రీకృత వంటశాల, శ్రీకృష్ణ ఆలయం, గోశాల నిర్మిస్తున్న ఇస్కాన్ సంస్థ జిల్లా మంత్రిని మరిచిపోయారు. జిల్లాలో ఏకైక మంత్రిగా కొనసాగుతున్న సుచరిత పేరును ముద్రించకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైట్లు తెలుస్తోంది.
ప్రోటోకాల్ ఎందుకు మిస్సైంది?
ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ఏవైనా.. ముఖ్యమంత్రి తరువాత ప్రొటోకాల్ విషయంలో అందరికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా జిల్లా మంత్రి, నియోజకవర్గ ఇన్ ఛార్జీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఆ తరువాత క్రమ పద్దతిలో తక్కినవారికి ప్రోటోకాల్ తప్పనిసరి. ఈ విషయాన్ని ఇస్కాన్ మరిచిందా? లేక ఆయా ప్రభుత్వ శాఖాధికారులు మరిచారా? అన్నది తెలియాలి! సీఎం జగన్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాధరాజు, ఇస్కాన్ చైర్మన్ మధు పండిత దాస్ వంటి పేర్లును శిలాఫలకంపై పెట్టారే తప్ప, సుచరిత పేరును విస్మరించారు. అందుకే ఈ కార్యక్రమానికి సుచరిత హాజరుకాలేదని తెలుస్తోంది.దీంతో గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నప్పటికీ, సుచరిత కనిపించకపోవడంతో మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
Must Read:-ముందుస్తుకు పోతే ముప్పు వైసీపీకే! తనగొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్!!











