అభ్యంతరాలతో ఆనం యుద్ధం!
కొత్త జిల్లాల ఏర్పాటులో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన చేస్తున్నారు. వెంకటగిరి నియోజకర్గాన్ని బాలజీ జిల్లాలో కాకుండా, నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఆనం డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిన్న నిరాహార దీక్ష చేస్తున్న వెంకటగిరి జేఏసీ నేతలకు ఆయన మద్దతు కూడా తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలికి జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు తెలియజేశారు. ప్రజా అభ్యంతాలను ప్రభుత్వానికి పంపాలని కోరారు. విభజన ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందని ఆరోపించారు. జిల్లా విభజన విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అనే కొత్త ప్రశ్నలు సంధించారు ఆనం!
కాంగ్రెస్ గతే.. వైసీపీ పడుతోందా?
రాష్ట్రంలో పునర్విభజన నేపధ్యంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఆరని మంటలను రేపుతోంది! నోరు మెదపకుండా కొంత మంది సైలెంట్ గా ఉంటే.. సీనియర్స్ బయటకొచ్చి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేశాలను రెచ్చగొడితే.. ఆ మంటల్లో కాలిపోయేది అధికార వైసీపీనేనని సొంతపార్టీ నేతలే ఆరోపింస్తున్నారు. ‘‘ప్రజాభిప్రాయాలు సేకరించకుండా, మేజారిటీ అభిష్టం నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా జిల్లాలను విభజిస్తే తీవ్రంగా నష్టపోయేది అధికార వైసీపీనే అని సీనియర్ పొలిటిషియన్, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు.’’ మొండిగా ముందుకు పోవడం వలన రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కు ఏ గతైతే పట్టిందో .. అదే గతి వైసీపీకి పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చురకలు అంటించారు. విభజనతో సోమశిల ప్రాజెక్ట్ నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
Must Read:-ముందుస్తుకు పోతే ముప్పు వైసీపీకే! తనగొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్!!











