బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, బెంగుళూరు ఎంపీ తేజస్వీ సూర్యపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తేజస్వీ సూర్య హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార సభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అలాగే ఈ నెల 24న ఉస్మానియా యూనివర్శిటీ సభలో తేజస్వీ సూర్య పాల్గొని విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు.
దీనికి ముందు తేజస్వీ సూర్య పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో కలిసి ఉస్మానియా యూనివర్శిటీలోకి ర్యాలీగా వెళ్లారు. పాదయాత్రగా ఓయూకి వెళ్తున్న తేజస్వీని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేటు దూకి బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్లారు. అనుమతి లేకుండా ఉస్మానియా యూనివర్శిటీలో సభ నిర్వహించినందుకు ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదు చేశారు. తేజస్వీతో పాటు బీజేపీ నేతలపై ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 447, హైదరాబాద్ సీపీ యాక్ట్ 21/76 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Must Read ;- సర్జికల్ స్ట్రైక్ నుంచి ‘సమాధులకు’ చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయం!