తమిళ దళపతి విజయ్ ప్రస్తుతం మాస్టర్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయినప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ విషయంలో సంధిగ్ధత నెలకొనడంతో నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే.. విజయ్ 65వ సినిమా కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైపోయాయి. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మాణంలో.. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ మూవీలో పలువురు బాలీవుడ్ నటీనటుల్ని తీసుకోవాలని అనుకుంటున్నారట నిర్మాతలు. ముఖ్యంగా హీరోయిన్ గా దీపీకా పదుకొనే ను, విలన్ గా జాన్ అబ్రహం ను ఎంపిక చేయబోతున్నారట. ఆ మేరకు వారితో చర్చలు కూడా జరుగుతున్నాయట. అత్యంత భారీ బట్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.
Must Read ;- వెబ్ సిరీస్ లో నటించనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో