టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ద్వితీయ వివాహం నేడే (జనవరి 9). రామ్ వీరపనేనితో సునీతకు హైదరాబాద్ లో ఇటీవల నిశ్శితార్థం కావడం తెలిసిందే. పెళ్లికి ముందుగా ఈ నూతన జంట రామ్, సునీత కలిసి సినీ ప్రముఖులకు, ఫ్రెండ్స్ కి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వడం జరిగింది. అయితే.. రామ్, సునీత పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసినప్పటి నుంచి పలువురు సినీప్రముఖలు, స్నేహితులు, సన్నిహితులు ఈ కొత్త జంటను ఆశీర్వదిస్తూ.. అభినందనలు తెలియచేసారు.
అయితే.. ఈ రోజు పెళ్లి సందర్భంగా సునీత తన పిల్లలతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో తల్లి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభింస్తుండం పట్ల పిల్లల కళ్లల్లో ఆనంద కనపడుతోంది. ఇదిలా ఉంటే.. సునీత మెహందీ వేడుకకు సంబంధించిన వీడియోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్‌లో సునీత మెహందీ ఫంక్షన్ వీడియో షేర్ చేసారు. ఆ వీడియోలో కొత్త పెళ్లి కూతురుగా సింగర్ సునీత చేతులకు మెహందీ పెట్టుకుని సిగ్గుపడుతూ కనిపించారు.
Must Read ;- సింగర్ సునీత మ్యారేజ్ కి సంక్రాంతి శోభ
నిరాడంబరంగా జరుగుతున్న సునీత వివాహానికి ఇరుకుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం.
ఇక ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్ సుమ, రేణు దేశాయ్ మరికొంత మంది సెలబ్రిటీలు హాజరైనట్టు తెలిసింది.