తానో కృత్రిమ గ్రహాన్ని చూసినట్టు పాకిస్థాన్ కు చెందిన ఓ పైలెట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్లే మార్గంలో గుర్తించడానికి వీలుకాని ఒక వస్తువును చూశానంటూ చెప్పుకొచ్చాడు. జనవరి 23 సాయంత్రం 4 గంటలకు ఎయిర్ బస్ ఏ-320 విమానంలో వెళ్తుండగా రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో ఓ ప్రకాశవంతమైన వస్తువును చూసినట్టు ఆ పైలట్ తెలిపాడు. అంత వెలుగులోనూ ఆ వస్తువు చాలా ప్రకాశవంతంగా కనిపించిందని పేర్కొన్నాడు. ఉదయం సమయంలో తాము ఎన్నడూ ఇటువంటి వస్తువులను చూడలేదని తెలిపాడు. తాను చూసింది గ్రహం కాకపోవచ్చు కానీ కృత్రిమ గ్రహం లేదా అంతరిక్ష కేంద్రం అయి ఉండొచ్చని పైలట్ చెప్పుకొచ్చాడు.
https://twitter.com/ask_not_why/status/1354411561507577856?s=20
మరోవైపు రహిమ్ యార్ ఖాన్ ప్రాంతంలోని ప్రజలు కూడా ఈ ప్రకాశవంతమైన వస్తువును చూసినట్టు చెబుతున్నారు. చాలా మంది ఈ ప్రకాశవంతమైన వస్తువును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ అధికారి దీనిపై స్పందిస్తూ.. ఆ వస్తువు ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఆకాశంలో ఓ వస్తువు కనిపించినట్టు మాత్రం తాము రిపోర్ట్ చేసుకున్నట్టు చెప్పారు.
Must Read ;- నాది ‘మార్స్’.. భూగ్రహవాసులను కాపాడడానికి వచ్చాను!










