ప్రభాస్ ఇప్పుడు ఒక పేరు మాత్రమే కాదు .. యూత్ ను, మాస్ ఆడియన్స్ ను ఊపేసే ఒక శక్తి. దక్షిణాదిన పాన్ ఇండియా సినిమాలు రూపొందించాలనుకున్న దర్శక నిర్మాతలకు ముందుగా కనిపించే హీరో ప్రభాస్. భారీతనం ఆయన సినిమాకి ప్రధాన లక్షణంగా .. ప్రధమ లక్షణంగా మారిపోయింది. ‘సాహో’ తరువాత ప్రభాస్ ఎప్పటిలానే కూల్ గా తన పనులను చేసుకుంటున్నాడని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ సమయంలో కూడా ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై ఎంతలా శ్రద్ధ పెట్టాడనేది ఒక్కో ప్రాజెక్టు పట్టాలెక్కుతుంటే ఇప్పుడు అర్థమవుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ జోనర్లలో రూపొందుతున్నవే. వివిధ భాషల్లోకి విడుదలయ్యేలా భారీ బడ్జెట్లతో నిర్మితమవుతున్నవే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ – కొరటాల కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. అయితే ప్రభాస్ ఆల్రెడీ అరడజను సినిమాలు లైన్లో పెట్టిన తరువాత కొరటాల ఎక్కడి నుంచి ఎంట్రీ ఇస్తాడని అనుకోనవసరం లేదు. ప్రభాస్ తన 25వ సినిమాను కొరటాలతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట .. అదీ విషయం. అది ప్రభాస్ నిర్ణయం అయినప్పుడు కాదనడానికి మనమెవరం?
ఇప్పుడు ప్రభాస్ ‘రాధేశ్యామ్‘ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత సినిమాగా ‘సలార్‘ను కూడా లైన్లో పెట్టేశాడు. ఇక ఓం రౌత్ .. నాగ్ అశ్విన్ .. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకులుగా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో సంచనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారనున్నాడు. అలాంటి ప్రభాస్ ఆ తరువాత సినిమాను కొరటాలతో చేయనున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ కి ఇది 25వ సినిమా .. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారని అంటున్నారు. ఓ మూడేళ్ల తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మిర్చి’ భారీ విజయాన్ని సాధించింది. అంతకుమించిన ఘాటుతో తమ తదుపరి సినిమా ఉండాలని ఇద్దరూ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Must Read ;- ప్రభాస్ పెళ్లి కుదిరిందట.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా.?











