నేను ‘ఎలియన్’ని.. నాది మార్స్ గ్రహం.. నేను భూవాసులను రక్షించడానికి వచ్చాను. నేనే కాదు.. నాలాంటి ఎందరో ఈ భూమిపైన జన్మించారు. ఇలా ఎవరైనా అంటే మొదట నవ్వురాక మానదు.. కానీ తాను మార్స్ వాసినని.. తిరిగి భూమిపై జన్మించానని చెప్పుకుంటున్న బొరిస్కా వెల్లడిస్తున్న విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యానికి గురవ్వడం శాస్త్రవేత్తల వంతైంది. ఇంతకీ బొరిస్కా ఎవరు? అతను చెప్తున్న విషయాలేంటి? ఇన్ని విషయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన బోరిస్కా ఏమయ్యాడు? ప్రస్తుతం ఎక్కడున్నాడు? మరి ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం రండి..
బొరిస్కా ఎవరు?
1996లో రష్యాలోని వోల్స్కి అనే గ్రామంలో జన్మించారు బొరిస్కా. పుట్టిన రెండు సంవత్సరాలకే అద్భుతమైన బొమ్మలు గీయడం ప్రారంభించారు. మొదట్లో అవి అర్ధరహితమైనవిగా భావించినా.. పరిశీలించిన మీదట గ్రహాలకు సంబంధించిన చిత్రాలుగా తెలిసాయి. గ్రహాలు, అంతరిక్షంకు సంబంధించిన విషయాల్లో అతని జ్ఞానం, పరిజ్ఞానం చూసి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, చివరికి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అతను ఇన్ని విషయాలు ఇంత లేత వయస్సులో ఎలా తెలుసుకున్నాడో తల్లి సైతం చెప్పలేకపోయారు. డాక్టర్లు పరిశీలించినా కూడా అతని గురించి ఏం తెలుసుకోలేకపోయారు.
Must Read ;- ఏలియన్స్ ఉనికిని చాటిన రేడియో సిగ్నల్స్

ఆశ్చర్యపరుస్తున్న నిజాలు..
ఇదిలా ఉంటే.. మార్స్ గ్రహానికి సంబంధించి ఈ పిల్లవాడు చెప్తున్న విషయాలు వింటే ఎవరరైనా నోరెళ్లబెట్టకుండా ఉండలేదు. బోరిస్కాకు కేవలం 11 ఏళ్లు ఉన్న సమయంలో.. భూమిపై హిందూ మహాసముద్రం ప్రాంతంలో లుమేరియా అనే పేరుగల నాగరికత విలసిల్లుతున్న సమయంలో.. అప్పటికే మార్స్ న్యూక్లియర్ టెక్నాలజీని అందుకుందని.. అప్పుడు జరిగిన యుద్ధంలో మార్స్‌పై జీవనం దాదాపు అంతరించి పోయిందని చెప్పుకొచ్చాడు. అప్పటి యుద్దం తర్వాత బతికిన అతి కొద్ది మందిలో కొందరు భూమిపై జన్మించారని.. వారిని ‘ఇండిగో’ చిల్డ్రన్ అంటారని చెప్పుకొచ్చాడు. తను చెప్తున్న సమాచారం ప్రకారం.. తనొక్కడే కాదు ఇంకా ఎందరో భూమిపై మర్స్ నుంచి మళ్లీ జన్మేత్తినట్లుగా చెప్తున్నారు బొరిస్కా.
అంతేనా.. మర్స్ వాసులకు ఈజిప్ట్ వాసులతో మంచి సత్సంబంధాలు కొనసాగేవని కూడా చెప్తున్నాడు. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. అది వింటే.. వామ్మో ఇతను నిజంగా ఏలియనా అనిపించకమానదు. ఇంతకీ అదేంటంటే.. ఈజిప్ట్ లోని ‘Great Sphinx of Giza’ చెవి వెనకాల ఉంటే ఒక మెకానిజం ద్వారా ఆ శిల రహస్యాలు తెలుస్తాయని చెప్పాడు.. అంతేకాదు.. అది ఈ భూమిపై జీవనాన్ని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పాడు. అతను చెప్పినపుడు ఎవరూ పట్టించుకోకపోయినా.. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అది నిజమని తేలడంతో బొరిస్కా మాటల వెనక నిజం ఉందా అనే ఆలోచన మొదలైంది శాస్త్రవేత్తలలో. అంతేకాదు 2012లో రష్యాలో వరదలు వస్తాయని ముందే చెప్పాడు. అతను చెప్పింది అక్షరాల నిజమే అయింది. 2012లో వచ్చిన వరదల్లో 171 మంది దాకా చనిపోయారు.
Also Read ;- నిన్న న్యూయార్క్ నేడు అహ్మదాబాద్.. వీడని మిస్టరీ?

అతని మాటలు.. శాస్త్రవేత్తలకు ప్రశ్నలు..
అతను చాలా మామూలుగా చెప్తున్న విషయాలు శాస్త్రవేత్తలకు సరికొత్త ప్రశ్నలుగా మిగిలాయి. నేటికి మర్స్ పైన ఏముందో కనుగొనడానికి మన ఖగోళ శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, మర్స్ గ్రహం పైన జీవజాలం గురించి బోరిస్కా వివరించిన విషయాలను నేటికీ మన శాస్త్రవేత్తలు కనుగొనలేకపోతున్నారు. మార్స్‌పై నివసించే వ్యక్తులు భూగ్రహవాసులకంటే రెండు మీటర్ల ఎత్తు ఉంటారని.. కానీ వారి ఆయుర్థాయం మాత్రం కేవలం 35 సంవత్సరాలు మాత్రమే అని చెప్పారు బొరిస్కా. అంతేకాదు.. భూవాసులకు భిన్నంగా అక్కడి వారు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని జీవిస్తారని కూడా చెప్పడంతో.. ఇలాంటివన్నీ ఎలా చెప్తున్నాడో మూలలు నేటికీ కనుక్కోలేకపోతున్నారు శాస్త్రవేత్తలు.
భూమిపై పుట్టిన ఇండిగో పిల్లలు.. మిగిలిన పిల్లలితో పోలిస్తే తెలివితేటల్లో బాగా మెరుగ్గా, చురుగ్గా వ్యవహరిస్తారని.. మేమంతా న్యూక్లియర్ దాడుల నుండి భూగ్రహావాసుల్ని కాపాడడానికి ఇక్కడ పుట్టామని చెప్తున్నారు బోరిస్కా. అంతేకాదు.. ఒకప్పుడు ఎలియన్స్‌కి భూవాసులతో సత్సంబంధాలు ఉండేవని.. మార్స్ గ్రహావాసులు, భూమిపై నివసించే వారితో పోలిస్తే తెలివైన వారు.. టెక్నాలజీలో ముందున్న వారని కూడా చెప్తున్నారు.
అసలేంటిదంతా? ఇప్పుడా బొరిస్కా ఎక్కడున్నాడు?
అతను చెప్తున్న విషయాలు విన్న ఎవరికైనా.. అసలేంటి ఇదంతా? ఇది నిజమేనా? ఇలా పలు అనుమానాలు కలగకమానవు. 23 ఏళ్ల బొరిస్కా, ఒకప్పడు చెప్పిన ఈ మాటలు తేలిగ్గా కొట్టిపారేయడానికి కూడా లేదంటున్నారు సైంటిస్టులు. మార్స్ గ్రహానికి, భూవాసులతో ఉన్న సంబంధాల గురించి వివరిస్తూ అతను చెప్పిన ఈజిప్ట్ శిల విషయం నిజమే అయింది. అదే కాదు.. అతను చెప్పిన ఎన్నో విషయాలు తర్వాతి కాలంలో నిజాలని తేలాయి. మరి మార్స్ గ్రహం గురించి బొరిస్కా చెప్పినవి నిజాలెందుకు కాకూడదనే ప్రయత్నాల్లో పడ్డారు శాస్త్రవేత్తలు.
గ్రహాంతవాసిగా పేరు పొందిన బొరిస్కా గత కొద్దికాలంగా ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో అర్థం కావడంలేదు. అతనెక్కడున్నాడని కనుగొనడానికి ప్రయత్నించిన రిపోర్టర్లు సైతం నిరాశతో వెనుదిరగక తప్పలేదు. కానీ, అందిన కొంత సమాచారం మేరకు రష్యా ప్రభుత్వ రక్షణలో ఒక మారుమూల గ్రామంలో తన కుటుంబంతో ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది. ఇక్కడే ఇంకో చిత్రం తెరపైకి వచ్చింది. కొందరు తమ దృష్టి కేంద్రీకరించి అతనిని కమ్యునికేట్ చేయడానికి ప్రయత్నించినపుడు.. అతను కూడా ఇదే సమాధానం చెప్పినట్లు చెప్తున్నారు.











