మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఆచార్య’లో గురుశిష్యులుగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి ఆచార్య అయితే, సిద్ధ పాత్రను రామ్ చరణ్ పోషిస్తున్నారు. వీరి లుక్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. తాజాగా వీరి లుక్ మరొకటి విడుదలైంది. ఓ అడవిలో చెట్టు కింద గురుశిష్యులు కూర్చుని ఉన్న ఫొటోను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ కోకాపేటలో వేసిన దేవాలయం సెట్ లో శరవేగంగా జరుగుతోంది. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తియిందని తాజా సమాచారం.
ఈ సినిమా విడుదలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ ల మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 15 రోజుల నుంచి ఈ షెడ్యూల్ జరుగుతోంది. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబరులో 13న ట్రిపుల్ ఆర్ విడుదలయ్యే పక్షంలో ‘ఆచార్యా’ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ట్రిపుల్ ఆర్ వాయిదా పడితే మాత్రం దసరాకి ‘ఆచార్య’ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువ. రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి ఉందని సమాచారం.
సంక్రాంతికి విడుదల చేయాలన్న ఆలోచన ఉన్నా ఆ సమయంలో విడుదల కావలసిన సినిమా జాబితా ఎక్కువగానే ఉంది. ఆచార్య విడుదల దసరాకా? సంక్రాంతికా? అన్నదాని మీద త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ సినిమా విడుదలపై మెగాస్టార్ చిరంజీవిని జర్నలిస్టులు అడిగినప్పుడు కూడా అలాంటి సమాధానమే వచ్చింది. అందువల్ల విడుదల తేదీ మీద చిత్ర యూనిట్ కే స్పష్టత లేదు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్, రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నారు. కొరటాల ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Must Read ;- మెగాస్టార్ ‘ఆచార్య’తో మూడు గంటల ముచ్చట్లు