రాజ్ తరుణ్ రంగంలోకి దిగుతూనే వరుస సక్సెస్ లను అందుకున్నాడు. లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాతనే ఆయన అడుగులు తడబడ్డాయి .. ఆయన సినిమాలపై పరాజయాలు ఎగబడ్డాయి. దాంతో ఆయన సక్సెస్ అనే మాట విని చాలాకాలమైంది. ఒక్క హిట్టు అయినా దొరక్కపోతుందా అని ఆయన ‘వల’ విసిరి కూర్చుని చాలా రోజులైంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘పవర్ ప్లే’ సిద్ధమవుతోంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా నడవనుంది.
వరుస పరాజయాల కారణంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజ్ తరుణ్, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో అంగీకరించిన సినిమానే ‘పవర్ ప్లే’. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ చూస్తుంటే, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. రాజ్ తరుణ్ తాను టెన్షన్ పడుతూ .. ఆడియన్స్ ను టెన్షన్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన జోడీగా ‘హేమల్’ అనే కొత్తమ్మాయి పరిచయమవుతోంది. పూర్ణ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇక కోట శ్రీనివాసరావు .. అజయ్ కూడా కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ ను బట్టి .. ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది.
గతంలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో దర్శకుడిగా విజయ్ కుమార్ కొండా యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ఎన్నిసార్లు ప్రసారమైనా మంచి రేటింగ్ వస్తుండటం విశేషం. అలా ఒకమంచి ఎంటర్టైనర్ అందించిన దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘పవర్ ప్లే’ పై అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా థియేటర్లకి వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనేది చూడాలి. అలాగే వరుస ఫ్లాపులతో రాజ్ తరుణ్ పడుతున్న టెన్షన్ ను ఈ సినిమా తీరుస్తుందా? అనేది కూడా చూడాలి.
Must Read ;- ఓటీటీ బోల్డ్ కంటెంట్ కు ఇక గుడ్ బై!