రాజా సింగ్ విషయం సర్దుమణిగిందిలే అనుకుంటుంటే.. మరో వివాదం మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంట్లోని 6 ఆవులను దొంగలించి అక్టోబర్ 2020 దొంగలించారని, దొంగతనం జరిగి మూడునెలలవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పోలీసులపై ఫైర్ అవుతున్నారు జగ్గారెడ్డి. ఇన్నాళ్లు పోలీసులు పరిష్కరిస్తారని ఎదురుచూశానని, కానీ వాళ్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని, అందుకే ఇప్పుడు మీడియా సముఖంగా విషయం బయటకు వెళ్లడిస్తున్నానని చెప్పుకొచ్చారు. వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా డిజిపీకి విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల క్రితమే రాజా సింగ్ వివాదం
ఆవుల సమస్య జగ్గారెడ్డి ఆరోపణలతో మరోసారి తెరపైకి వచ్చింది. రెండు రోజుల క్రితమే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజా సింగ్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఆవుల తరలింపులో పోలీసులు డబ్బులు తీసుకుంటున్నారనీ రాజాసింగ్ ఆరోపించడంతో.. రాష్ట్ర డిజీపీ దానిపై చాలా స్ట్రాంగ్‌గా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీచేశారు. ఈ వివాదంలో బండి సంజయ్ కూడా రాజా సింగ్‌కి మద్దతుగా నిలిచారు. అందరినీ అనడం లేదని, కొందరు పోలీసులు అలా చేస్తున్నారని వారిపై ముందు చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు.
మళ్లీ రేపిన జగ్గారెడ్డి..
కౌంటర్లు.. ఎన్‌కౌంటర్లు.. అంతా ముగిసిపోయాయిలే అనుకుంటున్న సమయంలో జగ్గారెడ్డి వివాదంతో మళ్లీ పోలీసులు సెంటర్ ఆఫ్ పాయింట్‌గా నిలిచారు. ఆవు రాజకీయాలు బీజేపీ కొత్తేమీ కాదని కొందరంటుంటే.. మూగ జీవాల పట్ల పోలీసులకు అంత నిర్లక్ష్యమా అంటూ కొన్ని సంఘాలు పోలీసులను రివర్స్‌లో మాట్లాడుతున్నారు. మరి ఈ ‘ఆవుల వివాదం’ ఎంత దూరం పోనుందో.. ఎక్కడ ఆగుతుందో..
Must Read ;- ఎమ్మెల్యే రాజాసింగ్, సిపి సజ్జనార్ మధ్య మాటల యుద్ధం











