ఒకప్పుడు టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ తీయడంలో మంచి పేరున్న దర్శకుడు ఓ.యస్.ఆర్. ఆంజనేయులు నేడు కన్నుమూశారు. ఆయన చిరంజీవి, రంగనాథ్ హీరోలుగా నటించిన ‘లవ్ ఇన్ సింగపూర్, రోజా రమణి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన కన్నెవయసు’ సినిమాల్ని తెరకెక్కించారు. ఈ రెండూ మలయాళ రీమేక్సే కావడం విశేషం. ఈ రెండు చిత్రాలూ టాలీవుడ్ లో సూపర్ హిట్స్ అయ్యాయి. ఇంకా మరికొన్ని చిత్రాలు రూపొందించి.. మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆంజనేయులు వయసు రీత్యా కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా నేడు తుది శ్వాసవిడిచారు. ఆంజనేయులు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
Must Read ;- బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత