రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యేను ఎంతో ధైర్యంగా ప్రశ్నించాడు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని కోరాడు. కానీ, దానికి ఎమ్మెల్యే నుండి సానుకూల స్పందన రాకపోగా.. బూతు పురాణం అందుకున్నాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. హఠాత్తుగా ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని మరణించి విషాదాన్ని మిగిల్చాడు. బెస్తవారిపేట మండలం సింగనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కోనపల్లిలోని పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగా జరగడం లేదని.. చర్యలు చేపట్టాలని స్థానిక గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుకు విన్నవించాడు జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్యనాయుడు. వెంటనే ఎమ్మెల్యే గారికి కోపం తన్నుకొచ్చింది. అవతలి పార్టీ వ్యక్తి కావడం వల్లనో.. తనను ప్రశ్నించాడనే కోపమో.. ఆ వ్యక్తిపై ఆగ్రహాంతో ఊగిపోయారు ఎమ్మెల్యే.
ఇది జరిగి రెండు రోజులవుతుంది. ఏముందిలే మామూలే కదా అనుకుంటున్న నేపథ్యంలో బండ్ల వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. అతని ఆత్మహత్యకు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కారణమంటూ జనసేన పార్టీ ఆరోపిస్తుంది. ప్రశ్నిస్తే.. ప్రాణాలు పొగొట్టుకోవాల్సిందేనా అంటూ అధికార పార్టీని నిలదీస్తూ ఓ లేఖ విడదల చేసింది జనసేన పార్టీ.
Must Read ;- తిరుపతికి పవన్.. బీజేపీకి బీపీ పెరిగినట్టేనా?