ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెడ్ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి నుంచి రామ్ కి మాస్ లో క్రేజ్ పెరిగింది. అందుకనే రామ్ దృష్టి ఇప్పుడు మాస్ సినిమాల పైనే ఉంది. రెడ్ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ్ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. త్రివిక్రమ్ – రామ్ కాంబినేషన్ లో మూవీ సెట్ కావడానికి ఇంకా టైమ్ పడుతుందని సమాచారం. అయితే.. రామ్ ఎవరితో సినిమా చేస్తాడనుకుంటే..కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమాని చేయడానికి ఓకే చెప్పాడు. తెలుగు, తమిళ్ లో రూపొందే ఈ చిత్రాన్ని ఈ రోజు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమం సైతం నేడే జరిగింది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు గాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇది డిఫరెంట్ యాక్షన్ మూవీ అని.. ఇందులో యాక్షన్ థ్రిల్ కలిగించేలా ఉంటుందని సమాచారం. రామ్ నటించనున్న 19వ చిత్రమిది. ఈ సినిమాని ఇలా ఎనౌన్స్ చేసారో లేదో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ ట్రెండింగ్ లో నిలవడం విశేషం. లింగుస్వామి విశాల్ తో తెరకెక్కించిన పందెంకోడి సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. మరి.. రామ్ తో చేస్తున్న ఈ మూవీ కూడా తెలుగు, తమిళ్ ఆడియన్స్ ని ఆకట్టుకుని విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- ఒకేసారి మూడు పాత్రల్లో రామ్ .. అవేమిటనేదే సస్పెన్స్
Tremendous Response for Terrific Combination of Energetic Star @ramsayz & Director @dirlingusamy#RaPo19 is Trending India wide#SrinivasaaChitturi @SS_Screens #SSS6 pic.twitter.com/32bipksIK0
— BARaju (@baraju_SuperHit) February 18, 2021