టాలీవుడ్ క్రేజీ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నవ్వుల చిత్రం ‘జాతి రత్నాలు’. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనుదీప్ కెవీ దర్శకుడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు శివరాత్రి కానుకగా ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘జాతిరత్నాలు’ ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్ . ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పనీ పాటాలేని ముగ్గురు ఫ్రెండ్స్ .. ఒక కేసులో ఇరుక్కొని చంచల్ గూడ జైల్లో పడతారు. చివరికి వారు ఇన్నోసెంట్స్ అని నిరూపించుకొని జైలు నుంచి ఎలా బైట పడతారు అన్నదే మిగతా కథ. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇందులో ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి .. తన కామెడీ టైమింగ్ తో సినిమాకి హైలైట్ గా మారబోతున్నాడని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. అలాగే.. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ , తణికెళ్ళ భరణి తదితరుల కామెడీ కూడా నవ్వులు పూయించబోతుందని తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో జడ్జ్ గెటప్ లో ఉన్న బ్రహ్మీ సైతం తన కామెడీ టైమింగ్ తో నవ్వులు వెదజల్లారు. మరి మన జాతి రత్నాలు .. ఏ రేంజ్ లో సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్ మూవీలో ఇద్దరు కామెడీ హీరోలు?











