నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ మలిచిన న్యూ ఏజ్ కామెడీ మూవీ ‘జాతిరత్నాలు’. మహాశివరాత్రి కానుకగా.. మార్చ్ 11న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తొలి రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకొని.. అడ్వాన్స్డ్ బుకింగ్ లో కూడా రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాల్ని మించి మంచి సక్సెస్ సాధించింది. దీంతో సినిమా టీమ్ సక్సెస్ సంబరాలు జరుపుకుంది.
నిజానికి ‘జాతిరత్నాలు’ మూవీ విడుదల రోజునే ‘శ్రీకారం, గాలి సంపత్’ మూవీస్ విడుదలైనప్పటికీ.. ఎక్కువ మంది ‘జాతి రత్నాలు’ చూడడానికే ఆసక్తి చూపించారు. హిలేరియస్ కామెడీ వర్కవుట్ చేసిన ఈ సినిమా టీమ్ ను పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల వీక్షించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించాడు. సినిమాను ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశాడు.
‘నిన్నరాత్రి జాతిరత్నాలు సినిమా చూశాను. మొత్తం టీమ్ కు అభినందనలు. నిజంగా హిలేరియస్ మూవీ. ఈ మధ్యకాలంలో నేనెప్పుడూ అంతలా నవ్వలేదు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి పెర్ఫార్మెన్స్ అయితే .. అదరగొట్టేశాడు. టాలీవుడ్ కు అతడి రూపంలో న్యూ ఏజ్ యాక్టర్ దొరికినట్టే. రాహుల్ రామకృష్ణ కూడా చాలా అద్భుతంగా నటించాడు’.. అంటూ బన్నీ తన మనసులో మాట చెప్పాడు. దీంతో ‘జాతి రత్నాలు’ సినిమా టీమ్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.
Also Read :కార్ వాన్ లో అల్లు అర్జున్ ఉన్నాడా?
Watched #JathiRatnalu last night . Congratulations to the whole team. Hilarious movie. I haven’t laughed soo much in recent years that much. @NaveenPolishety rocked the show with stellar performance. Rise of a new age stunning performer. @eyrahul was brilliant and effortless.
— Allu Arjun (@alluarjun) March 12, 2021