యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ఈ మధ్యనే ప్రారంభం అయిన షూటింగ్ మొదట్లో మెల్లగా స్టార్ట్ అయినా ఇప్పుడు వేగం పుంజుకుంది. ఇంకా శరవేగంగా షూటింగ్ జరపడానికి దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు కాస్త విరామం రావడంతో ఈమధ్యన తారక్ తన కుటుంబంతో కలిసి హాలీడేకు దుబాయ్ వెళ్ళాడు.
దుబాయ్ లో తారక్ తన భార్యాపిల్లలతో ఎంజాయ్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేసాయి కూడా. హాలీడే వెళ్లిన తారక్ ఆ ట్రిప్ ను ముగించుకొని ఇటీవల హైదరాబాద్ చేరుకున్నాడు. నేటి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో తారక్ పాల్గొననున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరో హీరో చరణ్ కూడా హైదరాబాద్ లోనే ఉండడంతో శరవేగంగా షూటింగ్ జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి అండ్ టీం రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వణికించే చలిలో కూడా సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఏదిఏమైనా వచ్చే ఏడాది మార్చి నెలలో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి.
అంతేకాకుండా సినిమాను 2021వ సంవత్సరం మధ్యలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చరణ్, తారక్ లపై వచ్చిన టీజర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ టీజర్లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అనడంలో సందేహం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను దర్శకుడు రాజమౌళి అనుకున్న సమయానికి పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి మరి.
Must Read ;- కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కు రాజమౌళి ఇచ్చిన ట్రీట్ ఇదే











