ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 21వ నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు పాల్ ప్రకటించారు. మూడు వ్యవసాయ సాగుచట్టాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ హైకోర్టులో పిటీషన్ వేశానని కేఏ పాల్ తెలిపారు.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు నాయకులను, రైతులను ఆయన గురువారం కలిశారు. ఈ సందర్భంగా వాళ్లకు సంఘీభావం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీకేయూ నేత రాకేష్ తికాయత్ తెలిపారు.
Must Read ;- నేను ట్రంప్‌నే లెక్కచేయను.. జగన్మోహన్ రెడ్డి ఎంత: కెఏ పాల్